భారతీయ పోస్టు (India Post) ప్రతి సంవత్సరం గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టులకు నియామక ప్రకటన విడుదల చేస్తుంది. బ్రాంచ్ పోస్టుమాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టుమాస్టర్ (ABPM), డాక్ సేవక్ లాంటి ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ నిర్వహించబడుతుంది. ఈ ఉద్యోగాలకు పరీక్ష లేకుండా కేవలం మెరిట్ ఆధారంగా సెలెక్షన్ ఉంటుంది.