లేఖ రాసి చేతులు దులుపుకుంటే సరిపోదు : పోతిరెడ్డిపాడు

advertise

రాష్ట్రంలో కరోనా కట్టడి పోతిరెడ్డిపాడు పై 203 జీవోను అడ్డుకోవడంలో తెరాస ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని భాజపా నేత మాజీ మంత్రి డీకే అరుణ విమర్శించారు . వివిధ రాష్ట్రాల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు వేళల్లో చేస్తుంటే తెలంగాణలో మాత్రం రోజుకు 500 పరీక్షలకే పరిమితం అవుతుందని ఆరోపించారు. మహబూబ్ నగర్లో మీడియాతో ఆమె మాట్లాడారు.. కరోనా కట్టడి విషయంలో ప్రభుత్వానికి హైకోర్టు ఎన్నిసార్లు మొట్టికాయలు వేస్తున్న సరిగ్గా స్పందించడం లేదని మండిపడ్డారు. ఐ సిఎమ్ ఆర్ నిబంధనలు అన్ని రాష్ట్రాలకు ఒక్కటేనన్నారు . ఇతర రాష్ట్రాల్లో పరీక్షలు చేస్తుంటే.. తెలంగాణలో ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. పోతిరెడ్డిపాడు పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన 203 ను రద్దు చేయాల్సిన బాధ్యత సీఎం కేసీఆర్ దేనని అరుణ అన్నారు. లేఖ రాసి చేతులు దులుపుకుంటే సరిపోదన్నారు. పోతిరెడ్డిపాడు విషయంలో పాలమూరు జిల్లా సహా ఇతర ఏ జిల్లాకు అన్యాయం జరిగినా భాజపా చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. ఈ విషయంలో పార్టీ పోరాటం కొనసాగుతుందని అరుణ స్పష్టం చేశారు.

advertise

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*