తన ఇంటి ముందు పెట్రోల్ బాటిల్ తో మహిళ హల్ చల్

advertise

తన ఇంటి ముందు హై టెన్షన్ విద్యుత్ తీగలు ఏర్పాటు చేయకూడదని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ ఓ మహిళ ఆందోళనకు దిగింది. తన ఇంటికి సమీపంలో నుంచి ఏర్పాటు చేసే నిర్మాణాన్ని ఆపకపోతే తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ పెట్రోల్ బాటిల్ తో హల్ చల్ చేసింది. చౌటుప్పల్ లో విద్యుత్ సబ్- స్టేషన్ కు అదనపు విద్యుత్ జంక్షన్ కోసం రామన్నపేట నుంచి ద్వారా విద్యుత్ లైన్ ఏర్పాటు చేయాలని ఆ సంస్థ నిర్ణయించింది. దీనికి అనుగుణంగా రామన్నపేట నుంచి చౌటుప్పల్ వరకు టవర్ల నిర్మాణం మొదలు పెట్టారు . చౌటుప్పల్ లో టవర్ ఏర్పాటు కోసం పునాది తవ్వి నిర్మాణం మొదలు పెట్టారు. అయితే అక్కడ నిర్మాణం చేపడితే తన ఇంటికి నష్టం జరుగుతుందని.. కూలిపోయే ప్రమాదం ఉందని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మాణ పనులు ఆపకపోతే పెట్రోలు పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించింది.

advertise

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*