ఫ్యాన్కు ఉరేసుకుని బుధవారం ఆత్మహత్య

advertise

మండల కేంద్రంలో కుర్మే గంగాధర్( 23) ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుని బుధవారం ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై రవీందర్ తెలిపారు. కోటగిరి మండలం కోడిచెర్ల కు చెందిన ఆయన కొన్నేళ్లుగా రుద్రూర్ లోని తన మేనమామ దక్కే చిన్న ప్రభాకర్ ఇంట్లో నివసించే వాడు. గతేడాది నుంచి హైదరాబాద్లో పని చేస్తున్నాడు. లాక్ డౌన్ కారణంగా మేనమామ వద్దకు తిరిగి వచ్చాడు. జీవితంపై విరక్తి చెంది బుధవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరేసుకొని మృతి చెందాడు .పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బోధన్ ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు ఆయన మేనమామ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

advertise

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*