అగ్ర కథానాయిక కీర్తిసురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం

advertise

అగ్ర కథానాయిక కీర్తిసురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం పెంగ్విన్ ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా పెంగ్విన్ ట్రైలర్ను చిత్ర బృందం గురువారం అభిమానులతో పంచుకుంటూ తెలుగు తమిళం మలయాళం భాషల్లో రూపుదిద్దుకున్న ఈ ట్రైలర్ను నాని ధనుష్ మోహన్లాల్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. సస్పెన్స్ థ్రిల్లర్గా రూపొందిన ఈ చిత్రం ట్రైలర్ ఆదథ్యం ఉత్కంఠభరితంగా ఉంది. ఇందులో తల్లి పోషించారు. అపహరణకు గురైన తన కుమారుడు అజయ్ ని ఓ రాక్షసుడు నుంచి కాపాడేందుకు ఆమె చేసే పోరాటం ఈ క్రమంలో ఆమె ఎదుర్కొనే సమస్యలను చాలా ఆసక్తి కరం గా చూపించారు. వీడియోను షేర్ చేసిన కీర్తి నమ్మకమే ఓ తల్లికి అతి పెద్ద ఆయుధం అని పేర్కొన్నారు. లాక్ డౌన్ వేళా థియేటర్ల పున ప్రారంభం పై స్పష్టత రాకపోవడంతో ఓటిటి వేదికగా విడుదల చేయనున్నారు జులై 19 అమెజాన్ ప్రైమ్ లో ఇది విడుదల కానుంది. కార్తికేయ సంతానం సుధ సుందరం జయరామ్ ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

advertise

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*