అక్రమంగా ఆయిల్ తరలిస్తున్న రాకెట్టు

advertise

సముద్రంలో ఆగివున్న నా ఓ డలా నుంచి అక్రమంగా ఆయిల్ తరలిస్తున్న రాకెట్టును పోలీసులు ఛేదించారు. ఐ.పోలవరం మండలంలోని భైరవపాలెం సమీపంలో రూ 12 లక్షల విలువచేసే 20 వేల లీటర్ల డీజిల్ అక్రమంగా తరలిస్తున్న బోటును వారు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు అమలాపురం డీ ఎస్పీ మాసూమ్ భాష గురువారం విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. రాజోలు సీఐ దుర్గా శేఖర్ రెడ్డి ఎస్సైలు ప్రశాంత్ కుమార్ శ్రీనివాసరావు రాము మరికొంతమంది పోలీస్ సిబ్బంది దాడి చేసి అక్రమంగా డీజిల్ తరలిస్తున్న బోటు తో సహా సంగడి గంగాద్రి ఆదినారాయణ చింత కాలాస్త్రి రేఖడి దొరబాబు చొక్కా దేవదాస్ కె శ్రీను బీ రస్వామి కర్రీ రాజులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారంతా సముద్రంలో ఆగివున్న ఓ డల నుంచి దొంగిలించిన ఆయిల్ ను కోనసీమలోని నది పాయ ల ద్వారా ఒడ్డుకు చేర్చి అక్రమ వ్యాపారం సాగిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. దీనిపై పూర్తి నిఘా పెట్టినట్లు పేర్కొన్నారు. ఇటువంటి అక్రమ వ్యాపారానికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని డి.ఎస్.పి హెచ్చరించారు. ఆయిల్ అక్రమ దందా పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రామ్ తెలిపారు.

advertise

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*