భాజపా నేతలను గృహ నిర్బంధంలో ఉంచడం

advertise

రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ముఖ్యమంత్రి కెసిఆర్ తో చర్చించేందుకు ప్రగతి భవన్ కు వెళ్లాలని నిర్ణయించిన భాజపా నేతలను గృహ నిర్బంధంలో ఉంచడం ప్రజాస్వామ్య వ్యతిరేక చర్య అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆక్షేపించారు. రాష్ట్ర మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్ ఇతర పార్టీ నేతలను పోలీసులు ఇంటి నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారన్నారు. ముఖ్యమంత్రిని విపక్ష పార్టీల నేతలు కలిసి ప్రజాసమస్యలను వివరించి వాటి పరిష్కారానికి కృషి చేయడం ప్రజాస్వామ్యంలో ఒక భాగం అన్నారు. అనేక నిరసన కార్యక్రమాలతో పాటు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి మంత్రులను కలవడం సర్వసాధారణం అయితే సీఎం ఎవరిని కలిసేందుకు అవకాశం ఇవ్వకపోవడం సమస్యలపై ప్రశ్నించిన విపక్ష నేతల పై దాడి చేయడం పరిపాటిగా మారింది ఇది ప్రజాస్వామ్యానికి భారత రాజ్యాంగానికి మంచిది కాదు రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వ్యక్తులు విపక్ష పార్టీల నేతలు కలుస్తామంటే అరెస్టు చేయడం గృహనిర్బా దించడం ప్రజాస్వామ్య వ్యతిరేక చర్య ప్రజాస్వామ్య వాదులందరూ ముఖ్యమంత్రి తీరును ఖండించాలి. అని బండి సంజయ్ దుయ్యబట్టారు.

advertise

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*