తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఈ నెలలోనే

advertise

ఇంటర్మీడియట్ మొదటి రెండో సంవత్సరం పరీక్షల ఫలితాలు ఒకేసారి ప్రకటించేందుకు తెలంగాణ ఇంటర్ బోర్డు కసరత్తు చేస్తోంది. ఈ నెలలోనే ఫలితాలను వెల్లడించే అవకాశం ఉందని ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ తెలిపారు. ఫలితాలు ఫలితాల నమోదు ప్రక్రియ తుది దశకు చేరుకుందని గత నెల 12 నుంచి 30 వరకు జవాబు పత్రాల మూల్యాంకనం నిర్వహించినట్లు చెప్పారు. జవాబు పత్రాల స్కానింగ్ మార్కులు అప్లోడ్ తుది పరిశీలన ఇంటర్నెట్ మెమోల రూపకల్పన వంటి సాంకేతిక ప్రక్రియను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 15 నాటికి ఈ ప్రక్రియ అంతా పూర్తవుతుందని చెప్పారు.

advertise

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*