అప్పుల బాధతో ఇంట్లో వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య

advertise

అప్పుల బాధలు తట్టుకోలేక ఎనికేపాడు లోని ఓ ఇంట్లో వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం ఏలూరుకు చెందిన గుడివాడ తేజస్వినికి విజయవాడకు చెందిన కృష్ణమోహన్( 35) తో కొన్ని నెలల క్రితం వివాహమైంది. తేజస్విని ఏలూరు లోని ఓ ప్రైవేట్ కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు. కృష్ణమోహన్ ఫైనాన్స్ వ్యాపారం చేసేవాడు, అందులో నష్టం రావడంతో వదిలేశాడు .అనంతరం కిటికీలు తయారు చేసే ఒక ఒక సంస్థలో పని చేస్తున్నాడు. తేజస్విని తండ్రి ఈ నెల 8న ఎనికేపాడు వచ్చి కూతురు అల్లుడిని ఏలూరు కి తీసుకెళ్లారు. కృష్ణమోహన్ 8న రాత్రి అక్కడే నివాసం ఉండి మరుసటి రోజు ఉదయం విజయవాడ వచ్చేశాడు. 10 తేజస్విని తన భర్త ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తలేదు.దీంతో 11న ఉదయం తేజస్విని తండ్రితో కలిసి ఎనికేపాడు లోని ఇంటికి వచ్చారు బయటనుంచి తలుపు తాళం వేసి ఉంది. పక్కన ఉన్న గ్రిల్స్ తాళం తెరిచి లోపలకు వెళ్లారు వంట గదిలో నుంచి లోపలికి వెళ్లి చూడగా కృష్ణమోహన్ మృతి చెంది ఉన్నాడు.మృతదేహం కిందపడిపోయి ఉంది రెండు రోజుల క్రితమే చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆర్థికంగా నష్టపోవడంతో అప్పులు ఉండడం వల్లే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. భార్య ఫిర్యాదు మేరకు పటమట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

advertise

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*