సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వం వాటా

advertise

సింగరేణి గనుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ అదిలాబాద్ పాలన ప్రాంగణం ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు. ఆ సమితి రాష్ట్ర కార్యదర్శి ఎస్ విలాస్ మాట్లాడుతూ సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వం వాటా 51% కేంద్ర ప్రభుత్వ వాటా 49 శాతం ఉందని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలో సింగరేణి ప్రైవేట్ పరం చేయమని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని అన్నారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి టెండర్ల ప్రక్రియను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం డీఆర్వో నటరాజుకు వినతి పత్రం అందజేశారు. ఏ ఐ టి యు సి జిల్లా కార్యదర్శి కుంటల రాములు సహాయ కార్యదర్శి దేవేందర్ నాయకులు సాంబన్న రాజు తదితరులు పాల్గొన్నారు.

advertise

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*