ప్రభుత్వ నిర్ణయం సరికాదని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంత రావు

advertise

అంటు వ్యాధుల నివారణ కోసం ప్రజలు బోనాల పండుగ నిర్వహించి ప్రత్యేక పూజలు చేస్తారు అలాంటి బోనాల నిర్వహణ పై ప్రభుత్వ నిర్ణయం సరికాదని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంత రావు అన్నారు. గురువారం మీడియాతో ఆయన మాట్లాడారు. మద్యం దుకాణాలకు అనుమతి ఇచ్చిన కేసీఆర్ ప్రభుత్వం బోనాల కు అనుమతి ఇవ్వకపోవడం దుర్మార్గమన్నారు బోనాలు ఇంటి దగ్గర పెట్టుకోవాలి, అని అనడం ప్రజా వ్యతిరేకమైన నిర్ణయం అని ఆయన అభిప్రాయపడ్డారు. ఎవరితో సంప్రదించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటున్నారని మండిపడ్డారు. నియంత్రణలో కూడిన బోనాలకు అనుమతి ఇవ్వాలని ఈ సందర్భంగా ప్రభుత్వం ఆయన డిమాండ్ చేశారు. బోనాల విషయంలో ప్రభుత్వం పునరాలోచించి కొంతమంది మహిళలకు అవకాశం ఇవ్వాలని విహెచ్ విజ్ఞప్తి చేశారు.

advertise

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*