విత్తనాల కోసం నిర్మల్ జిల్లా ముథోల్

advertise

వ్యవసాయ శాఖ అందించే రాయితీ విత్తనాల కోసం నిర్మల్ జిల్లా ముథోల్ లో రైతులు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా క్యూ లైన్లో నిల్చున్నారు. ఉదయం నుంచే గొడుగు పట్టుకుని టోకెన్ కోసం పడిగాపులు కాశారు. మరోవైపు వర్షాకాలం ప్రారంభమైన రాయితీ విత్తనాలు ఆలస్యంగా ఇస్తుండడంతో విత్తనాలు దొరుకుతాయో లేదో అని రైతులు ఆందోళన చెందుతున్నారు. రెండు కంటే ఎక్కువ ఇవ్వమని వ్యవసాయశాఖ ప్రకటించడంతో ఎక్కువ ఎకరాలు ఉన్న రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విత్తనాలు దొరక్క ప్రైవేట్ వ్యక్తులను ఆశ్రయిస్తే వారు అధిక ధరలకు విక్రయిస్తున్నారని వాపోయారు. ఉదయం నుంచి వర్షం లో నిల్చున్నామని అధికారులు తొందరగా టోకెన్ ఇవ్వాలని కోరారు.

advertise

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*