ఇన్ ఫార్మర్ అనే అనుమానంతో మావోయిస్టులు హతమార్చారు.

advertise

మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా ఏ ట పల్లి తాలూకా గట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని గు డంజు రు గ్రామానికి చెందిన రవి( 28) పోలీస్ ఇన్ ఫార్మర్ అనే అనుమానంతో మావోయిస్టులు హతమార్చారు. ఈ ఘటన గురువారం అర్ధరాత్రి జరిగింది. గుడంజు రు గ్రామానికి చెందిన రవి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం అర్థరాత్రి 10 మంది మావోయిస్టులు గ్రామంలోని రవి ఇంటికి వచ్చి నిద్ర పోతున్న రవిని లేపి తమాతో తీసుకెళ్లారు. బంధువులు, కుటుంబ సభ్యులు ఎక్కడికి తీసుకెళ్తున్నారని అని ప్రశ్నిస్తే వెంటనే వదిలిపెడతామని తీసుకు వెళ్లారు. బంధువులు ఊరి పక్కనే కోటి, కిటరీ టో లా గ్రామాలకు వెళ్లే మార్గంలో రవి మృతదేహానికి శుక్రవారం కనుగొన్నారు. ఈ మృతికి మేమె కారణమని, అతను ఇన్ఫార్మర్ గా వ్యవహరించడంతో శిక్ష అనుభవించాడని అక్కడ వదిలి వెళ్ళిన లేఖలో పేర్కొన్నారు.

advertise

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*