జిల్లాలో భూమి హద్దుల నెలాఖరులోగా చక్కదిద్దాలి

advertise

జిల్లాలో భూమి హద్దుల( ఎఫ్- లైన్ )కోసం పెట్టుకున్న దరఖాస్తులు అపరిష్కృతంగా ఉన్నాయని సంయుక్త కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు. సర్వేయర్లు పద్ధతి మార్చుకొని పనిచేయాలని.. జూన్ నెలాఖరు లోగా అన్నిటినీ చక్కదిద్దాలని ఆదేశించారు. సర్వే,ఇంటి పట్టాలు , రేషన్ కార్డులు, తదితర అంశాలపై కలెక్టరేట్ నుంచి మండల, మున్సిపల్ అధికారులతో వీక్షణ సమావేశం నిర్వహించారు జేసీ . మాట్లాడుతూ మీ సేవా కేంద్రాల్లోఎప్ -లైన్ కు 2,985 దరఖాస్తులు వస్తే చాలావరకు కొలిక్కి రాలేదన్నారు. తహసీల్దార్ లాగిన్ లో ఉన్న సర్వే దరఖాస్తులను సర్వేయర్ లాగిన్ పంపి పరిష్కరించాలని.. పట్టా సబ్ డివిజన్లు స్పందన అర్జీలు త్వరితగతిన చక్కదిద్దలన్నారు . కొత్త రేషన్ కార్డులు మంజూరు, పాత రేషన్ కార్డులు తొలగింపు, చేర్పులు మార్పుల కోసం వచ్చే దరఖాస్తులను నిర్ణీత గడువులోపు పరిష్కరించాలన్నారు . ఇంటి పట్టాల పనులన్నీ ఈ నెల 14 లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. తర్వాత వ్యవసాయ ,అనుబంధ శాఖల అధికారుల సమన్వయ కమిటీ సమావేశంలో పలు అంశాలపై జేసీ సమీక్షించారు.

advertise

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*