రాష్ట్రం దివాలా తీసేలా జగన్ ఏడాది పాలన

advertise

రాష్ట్రం దివాలా తీసే లా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏడాది పాలన సాగిందని భాజాపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు కేంద్రంలో భాజపా రెండోసారి అధికారం చేపట్టి ఏడాది అయిన సందర్భంగా ఆయన అనంతపురంలో మీడియాతో మాట్లాడారు ప్రజలంతా ప్రధాని మోదీ పాలనను హర్షిస్తున్నారన్నారు అయితే రాష్ట్రంలో మాత్రం ప్రజలు జగన్ పై పెట్టుకున్న నమ్మకం ఒక ఏడాదిలోనే పోయిందన్నారు ఐదేళ్లలోతెదేపా పాలనా ఏడాదిలో వైకాపా పాలనపై రెండు పార్టీలు సవాలు విసురుకుంటున్నాయని దుయ్యబట్టారు గతంలో శ్రీకృష్ణదేవరాయలురత్నాలను రాశులుగా పోసి అమ్మితే జగన్ ప్రభుత్వంలో ఇసుక రాశులుగా పోసి విక్రయిస్తున్నారని మండిపడ్డారు సొంత పార్టీ నేతలే ఇసుకపై ఇళ్ల స్థలాల అక్రమాలపై ఆరోపణలు చేస్తుంటేవైకాపా ఎం సమాధానం చెబుతుంది ? అని విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు

advertise

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*