ఆయన దివ్యాంగుడు ఆమె మూగ మనసులు కలిసిన ముహూర్తం

advertise

ఆయన దివ్యాంగుడు ఆమె మూగ రెండేళ్ల ప్రేమ బంధానికి గుర్తుగా మూడు ముళ్ళతో ఒకటయ్యారు. పెద్దల సమక్షంలో పరిణయమాడారు సుజాతనగర్ మండలం సీతంపేట బంజారా గ్రామానికి చెందిన గూగులోత్ రవి కుమార్ రంజి తండాకు చెందిన లావుడ్య స్రవంతికి రెండేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. ప్రతి నెల పింఛన్ నగదు కోసం మండల కేంద్రానికి వచ్చే వారు ఆ సమయంలో రవి కుమార్ తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమకు దారి తీసింది. వీరి విషయం పెద్దలకు తెలిసిం.ది ఇరు కుటుంబాలు వివాహానికి అంగీకరించారు. పాల్వంచ మండలం పెద్దమ్మ గుడి ఆవరణలో ని ఫంక్షన్ హాల్ లో బుధవారం రవి కుమార్ స్రవంతి వివాహం జరిపించారు. బంధుమిత్రులు నవ వధూవరులను నిండు మనసుతో ఆశీర్వదించారు.

advertise

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*