దేవరపల్లి లో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది

advertise

పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి లో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పూడి వరలక్ష్మి( 48) ఇంట్లో ఇటీవల ఓ శుభకార్యం జరిగింది. కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆమె కుమార్తె సరిత( 21) పుట్టింటికి వచ్చారు. శుక్రవారం తెల్లవారుజామున ప్రమాదవశాత్తు బాత్రూంలో కాలుజారి పడిపోయారు. తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందారు. కుమార్తె మరణాన్ని జీర్ణించుకోలేక పోయినా వరలక్ష్మి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే ఆస్పత్రికి తరలించగా గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఒకేసారి తల్లీకూతుళ్లు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

advertise

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*