లచ్చగూడెం గ్రామంలో రైతు వేదిక నిర్మాణానికి శంకుస్థాపన

advertise

మండల పరిధిలోని లచ్చగూడెం గ్రామంలో రైతు వేదిక భవన నిర్మాణానికి రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శనివారం శంకుస్థాపన చేశారు . క్లస్టర్ పరిధిలోని రైతులు ఈ వేదిక ను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. జిల్లా వ్యాప్తంగా 129 క్లస్టర్లలో భవన నిర్మాణాలు చేపట్టనున్నట్లు చెప్పారు. ఒక్కో భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ. 22 లక్షలు కేటాయించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సూచించిన విధంగావాన కాలంలో రైతులు మొక్కజొన్న సాగు చేయవద్దని సూచించారు. రైతులుసంఘటితమైతే అధిక దిగుబడులు సాధించి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చవచ్చని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు ,జడ్పీ చైర్మన్ కమల్ రాజ్ , కలెక్టర్ ఆర్ వీ కర్ణన్ రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు నల్లమల్ల వెంకటేశ్వరరావు ,మండల అధికారులు పాల్గొన్నారు.

advertise

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*