భార్య భర్తల మధ్య ఏర్పడిన మనస్పర్థల కారణంగా క్షణికావేశానికి దంపతులు బలి

advertise

భార్య భర్తల మధ్య ఏర్పడిన మనస్పర్థల కారణంగా క్షణికావేశంలో భార్య తీసుకున్న నిర్ణయానికి ఆ దంపతుల నిండు జీవితాలు బలయ్యాయి. ఎస్సై హరిప్రసాద్ వివరాల ప్రకారం.. వీరులపాడు మండలం అల్లూరుకు చెందిన గుంజి వెంకటేశ్వరరావు( 23) పెనుగంచిప్రోలు మండలం నవాబుపేట గ్రామానికి చెందిన శ్రావణి (21) ఎనిమిది నెలల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. శ్రావణి పుట్టింట్లో జరిగే శుభకార్యానికి హాజరయ్యే ఈ విషయంలో భార్యాభర్తల మధ్య వివాదం చోటు చేసుకుంది. దాంతో ఆమె శుక్రవారం ఉదయం పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేసుకుంది. బంధువులు వెంటనే ఆమెను వైద్యశాలకు తరలించారు. భార్య పరిస్థితి విషమంగా ఉండడంతో మనస్తాపం చెందిన వెంకటేశ్వరరావు ఆస్పత్రి వద్ద పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. చికిత్స పొందుతూ భార్య భర్తలు ఇద్దరూ మృతి చెందారు. ఆమె ప్రస్తుతం గర్భిణీ అని బంధువులు తెలిపారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.

advertise

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*