జి.హెచ్.ఎం.సి మేయర్ బొంతు రామ్మోహన్ కు వైద్యులు ఇవాళ మరోసారి కరోనా పరీక్షలు

advertise

జి.హెచ్.ఎం.సి మేయర్ బొంతు రామ్మోహన్ కు వైద్యులు ఇవాళ మరోసారి కరోనా పరీక్షలు నిర్వహించారు. గురువారం మేయర్ డ్రైవర్ కు కరోనా పాజిటివ్ టాక్ రావడంతో ముందు జాగ్రత్తగా ఆయనకు కోవిడ్ పరీక్షలు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఇవాళ ఆయన నుంచి వైద్యులు నమూనాలు తీసుకున్నారు. పరీక్షల నివేదికలు ఈ సాయంత్రం వరకు వచ్చే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. మరోవైపు మేయర్ పేషిలో పనిచేసే ఒక వ్యక్తి కూడా కరోనా పాజిటివ్ రావడంతో జిహెచ్ఎంసి అధికారులు ఇతర సిబ్బంది ఆందోళనకు గురవుతున్నారు. ఇదిలా ఉండగా క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా గతంలో నగరంలోని రోడ్డు పక్కనే ఉన్న ఓ హోటల్ లో అధికారులతో కలిసి మేయర్ టీ తాగారు హోటల్లో పని చేసిన వ్యక్తికి కరోనా వచ్చింది. అని తేలడంతో వారం క్రితం మేయర్ పరీక్ష చేయించుకోగా నెగిటివ్ వచ్చిన విషయం తెలిసిందే.

advertise

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*