సికింద్రాబాద్ లో ఓ రైల్వే ఉద్యోగి కి కరోనా పాజిటివ్ నిర్ధారణ

advertise

సికింద్రాబాద్ లో ఓ రైల్వే ఉద్యోగి కి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని హైదరాబాద్ భవన్ లోని పరిపాలన విభాగం లో పనిచేసే ఓ ఉద్యోగి కి కరోనా పాజిటివ్ వచ్చినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. సదరు వ్యక్తి కరోనా లక్షణాలతో బాధపడుతూ పరీక్షలు నిర్వహించుకోగా గురువారం పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ భవన్ ను నాలుగు రోజులపాటు మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. భవనాన్ని పూర్తిగా శానిటైజ్ చేస్తున్నట్లు చెప్పారు. సోమవారం నుంచి తిరిగి కార్యక్రమాలు ప్రారంభించినట్లు అధికారులు పేర్కొన్నారు. మరోవైపు వైరస్ కట్టడికి అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఉద్యోగికి రావడం అధికారంలో ఆందోళన కలిగిస్తుంది.

advertise

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*