కోటి విలువైన సిసి కెమెరాలను కొనుగోలు

advertise

రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత రెండు సురక్షిత ఆదర్శ నగరంగా కరీంనగర్ ను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు బిసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఇందులో భాగంగానే రూ.కోటి విలువైన సిసి కెమెరాలను కొనుగోలు చేసినట్లు మంత్రి తెలిపారు. నగరపాలక కార్యాలయంలో మేయర్ సునీల్ రావు కలెక్టర్ శశాంక్ సమక్షంలో సిసి కమలాసన్ రెడ్డి కి సిసి కెమెరాలతో పాటు అవసరమైన సామాగ్రిని మంత్రి అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం హామీ నిధుల (అస్యూరెన్స్ ) నుంచి ఈ డబ్బును కేటాయించినట్లు చెప్పారు. శాంతిభద్రతలు నిరంతరం కాపాడేందుకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి నుంచి చెబుతుంటారని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. నగరంలో ఎప్పుడు ఏ సంఘటన జరిగినా క్షణాల్లో పోలీసులకు చేరేందుకు సిసి కెమెరాలు ఎంతో దోహద పడతాయని మంత్రి వివరించారు.

advertise

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*