మాటలు రావు వినికిడి శక్తి లేదు, అయినా మనసులు కలిశాయి

advertise

ఇద్దరికీ మాటలు రావు వినికిడి శక్తి లేదు, అయినా మనసులు కలిశాయి. సైగల ద్వారా మనసులోని భావాలను వ్యక్తం చేసుకున్నారు. అంతే వారి మధ్య ప్రేమ చిగురించి వివాహం బంధంతో ఇటీవలే ఒకటయ్యారు. నేలకొండపల్లి మండలంరాయి గూడేనికి చెందిన నెమలి మనోజ్ కుమార్ కు మాట్లాడ లేరు వినలేరు. తల్లిదండ్రులు అతన్ని ఖమ్మంలోని ఓ పాఠశాలలో చేర్పించారు. అదే పాఠశాలలో చదువుతున్న విఎం బంజారాకు చెందిన జ్యోతి తో మనోజ్ కుమార్ కి పరిచయం ఏర్పడింది పాఠశాలల్లోనే ఇద్దరూ స్నేహితులు అయ్యారు జ్యోతి పదో తరగతి వరకు చదివివిఎం బంజారాలో ఇంటివద్ద ఉంటున్నారు. మనోజ్ కుమార్ హైదరాబాదులో ఐటిఐ పూర్తి చేశారు. చరవాణి లో ఇద్దరూ వీడియో కాల్ లో సైగల ద్వారా మాట్లాడుకునే వారు ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్న వీరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. తమ వివాహానికి పెద్దలు ఒప్పుకోరు అనే ఆలోచనతో బుధవారం పెళ్లి చేసుకున్న ఈ జంట గురువారం నేలకొండపల్లి పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు వీరి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యులు వచ్చి ఇద్దరితో మాట్లాడారు ఇద్దరు మేజర్లు కావడంతో కుటుంబ సభ్యులు పోలీసుల సమక్షంలో దండలు మార్చుకున్నారు.

advertise

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*