రెడ్ జోన్ లలో అప్రమత్తంగా ఉండండి-ఎస్పీ సెంథిల్ కుమార్

advertise

రెడ్ జోన్ లలో అందరూ అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సెంథిల్ కుమార్ కోరారు. చిత్తూరులోని మిట్టూరు, జనకారాపల్లి , రఘురామ్ నగర్ కాలనీ, మరికొన్ని కాలనీలో ఉన్న రెడ్ జోన్లను శుక్రవారం ఆయన పరిశీలించి అక్కడి అధికారులతో మాట్లాడారు. రెడ్ జోన్ నుంచి ఎవరు బయటకు రావడానికి వీల్లేదని, కొత్త వ్యక్తులు లోపలకు వెళ్లడానికి వీల్లేదని తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్క అధికారి, సిబ్బంది బాధ్యతగా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. నగర పాలక సంస్థ అధికారులు, సిబ్బంది క్రిమి సంహారక మందులను పిచికారి చేస్తున్నారని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు . నిత్యావసరాలనుఇళ్ల వద్దకే పంపేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారని, వాటి కోసం బయటకు రావద్దని సూచించారు. డీఎస్పీ ఈశ్వరరెడ్డి, సీఐ యుగంధర్, అనిల్ కుమార్, సిబ్బందిఎస్పీ వెంట ఉన్నారు.

advertise

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*