కలుషిత అల్పహారం తిన్న 30 మందికి అశ్వస్థత

advertise

ప్రతిరోజు తెచ్చుకునే చోటు నుంచి గురువారం కూడా వారు అల్పాహారం తెచ్చుకుని తిన్నారు. అలా తిన్న కొద్దిసేపటికే కడుపునొప్పి వాంతులతో ఇబ్బంది పడ్డారు. బాధితులను పోలీసులు తెలిపిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కొల్లిపర మండలం తూములూరు గ్రామంలో రోడ్డు వెంబడి ఒక మహిళ అల్పాహారాశాల నుంచి ఉపాధి హామీ పనులకు వెళ్లి కూలీలు స్థానికులు గురువారం ఉదయం దోశలు ఇడ్లీలు తెచ్చుకొని పిల్లలతో సహా తిన్నారు. వారిలో కొంతమందికి రెండు గంటలకు తర్వాత మరికొంతమందికి మధ్యాహ్న సమయంలో కడుపునొప్పి వాంతులు అయ్యాయి. దీంతో ఒకరి తర్వాత ఒకరు వైద్యశాల దాదాపు 30 మంది రావడంతో వైద్యాధికారులు అప్రమత్తమై ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. బాధితుల్లో నలుగురు పిల్లలు కూడా ఉన్నారు కొల్లిపర వైద్యశాలలో ఏడుగురికి చికిత్స అందిస్తుండగా, మిగిలిన 23 మందికి ప్రాథమిక చికిత్స చేసి 108 వాహనాల ద్వారా తెనాలి ప్రభుత్వ వైద్యశాల తరలించారు. ఎవరికి ప్రాణాపాయం లేదని వైద్యులు గురువారం సాయంత్రం తెలిపారు.

advertise

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*