అరెస్ట్ పై ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత స్పందించారు

advertise

టీడీఎల్పీ ఉపనేత టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అరెస్ట్ పై ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత స్పందించారు. ఈఎస్ఐ మందుల కొనుగోల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడినందుకు ఎసిబి అధికారులు అచ్చన్నా నాయుడు ని అరెస్టు చేశారని వెల్లడించారు. వైద్య పరికరాల కొను గోలులోనూ అవినీతి జరిగిందని పేర్కొన్నారు. అచ్చెన్నాయుడు అరెస్టు విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని వ్యాఖ్యానించారు. అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవద్ద? అని మంత్రి ప్రశ్నించారు. ఈఎస్ఐ వ్యవహారంలో తెదేపా నేత అచ్చెన్నాయుడు ఇవాళ ఉదయం శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ లోని ఆయన నివాసంలో ఎసిబి అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే సాయంత్రం 4 గంటలకు విజయవాడలో ఏసీబీ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.

advertise

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*