ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పరిశుధ్య నిర్వహణ హరితహారం

advertise

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పరిశుధ్య నిర్వహణ హరితహారం కార్యక్రమాలపై నిర్లక్ష్యం చేయకూడదని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం అమరచింత మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈనెల 20వ తేదీ నుంచి నిర్వహించే ఆరో విడత హరితహారం కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలన్నారు. గ్రామ పట్టణ రహదారులకు ఇరువైపులా నాటిన మొక్కల చుట్టూ కంచెను ఏర్పాటు చేయాలని తెలిపారు. ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరైన వైకుంఠధామం గ్రామీణ సీసీ రహదారి పనులు పూర్తి చేయాలని సూచించారు. నియంత్రిత సాగు విధానం పై రైతులకు అవగాహన కల్పించాలని బాధ్యత అధికారులపై ఉందని వివరించారు. ప్రభుత్వం సూచించిన పంటలను సాగు చేసి రైతుబంధు పొందాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ మాలతీ జడ్పిటిసి సరోజ మార్కెట్ వైస్ చైర్మన్ నాగభూషణం గౌడ్ ఎంపీడీవో రాజు రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు ఆషి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

advertise

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*