శ్రద్ధ కపూర్ ని షూటింగ్స్ కి వెళ్లనివ్వను నటుడు శక్తి కపూర్

advertise

కరోనా వైరస్ వల్ల పరిస్థితులు భయంకరంగా మారాయని తన కుమార్తె శ్రద్ధ కపూర్ ని తిరిగి ఇప్పుడే షూటింగ్ కి వెళ్ళను ఇవ్వనని నటుడు శక్తి కపూర్ అన్నారు. లాక్ డౌన్ సడలింపు లో భాగంగా షూటింగ్ ప్రారంభించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే త్వరలో ప్రారంభం కానున్న సినిమా బుల్లితెర షూటింగ్ ల గురించి శక్తికపూర్ తాజాగా స్పందించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నేను బయటకు వెళ్లి పని చేయాలని అనుకోవడం లేదు అలాగే నా కుమార్తెను కూడా షూటింగ్ కి పంపించాలనుకోలేదు కరోనా వైరస్ ప్రభావం తగ్గలేదు ముందు ముందు పరిస్థితులు ఇంకా దారుణంగా ఉంటాయి. మనిషి ప్రాణాల కంటే పని ముఖ్యం కాదు ఇప్పుడే షూటింగ్స్ ప్రారంభిస్తే పరిస్థితులు మరింత అస్థవ్యస్థంగా మారతాయీ ఇంకొంత సమయం వేచి చూడడం మంచిదని సినీ పరిశ్రమకు చెందిన నా స్నేహితులకు తెలియజేశాను అని ఆయన అన్నారు.

advertise

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*