రైతుల పట్ల అక్కినేని అమల దాతృత్వం

advertise

ప్రముఖ సినీనటి, బ్లూ క్రాస్ హైదరాబాద్ కో ఫౌండర్ అక్కినేని అమల రైతుల పట్ల నిజమైన దాతృత్వాన్ని చాటుకున్నారు. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం పాపిరెడ్డిగూడ లో సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో 650 మంది రైతులకు ఉచితంగా కంది విత్తనాలను అందజేశారు . ఒక్కో రైతుకు సుమారు నాలుగు కిలోల విత్తనాలను పంపిణీ చేసి వారిలో ఆనందాన్ని నింపారు . ఈ సందర్భంగా అమల మాట్లాడుతూ… సేంద్రీయ వ్యవసాయ విధానం లో పంటలు సాగు చేయాలని రైతులకు సూచించారు. ఈ విధానంపై రైతులు ఆసక్తి తో ముందుకు వస్తే నిపుణులైన శాస్త్రవేత్తలను పాపిరెడ్డిగూడకు పిలిపించి అవగాహన కల్పించినట్లు అమల పేర్కొన్నారు. అదే విధంగా ప్రస్తుతం నెలకొన్న కరోనా వైరస్ క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని అమల ఆకాంక్షించారు.

advertise

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*