అచ్చెన్న ఆరోగ్య పరిస్థితి

advertise

ఈ ఎస్ ఐ ఐ మందుల కొనుగోళ్ల కేసులో అరెస్టయిన టి డి ఎల్ పి ఉప నేత, టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ఆరోగ్యపరిస్థితిపై గుంటూరు జిజిహెచ్ సూపరింటెండెంట్ సుధాకర్ స్పందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని స్పష్టం చేశారు. రెండు లేదా మూడు రోజుల్లో గాయం నయమయ్యే అవకాశం ఉందని తెలిపారు. “ఎక్కువ సేపు ప్రయాణం వల్ల గాయం పెరిగింది. ఇన్ఫెక్షన్ పెద్దది అయితే మరోసారి ఆపరేషన్ చేయాల్సి రావచ్చు. అయితే 90 శాతం మేరకు ఆపరేషన్ అవసరం లేదు. అయితే ఇప్పుడే చెప్పడం కుదరదు. నొప్పి తగ్గడానికి రెండు మూడు రోజులు పడుతుంది. పూర్తిగా కోలుకోవడానికి కొన్ని రోజులు పట్టొచ్చు”అని సుధాకర్ వివరించారు. ఈ ఎస్ ఐ కేసులో విజయవాడ అనిశా కోర్ట్ అచ్చెన్నాయుడికి 14 రోజుల పాటు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. అయితే ఆయన అనారోగ్యం దృష్ట్యా ఆసుపత్రిలో చికిత్స అందించాలని ఆదేశించారు. ఈ మేరకు గుంటూరు జిజిహెచ్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

advertise

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*