ప్రమాదవశాత్తు చెట్టు పై నుంచి పడి వెన్నుపూస దెబ్బ

advertise

నెల్లూరు గ్రామీణ మండలం పొట్టే పాలెం పోర్లు కట్టపై ఓ పూరిగుడిసెలో జీవనం సాగిస్తున్న మణి నాగభూషణమ్మ నిరుపేద కూలీలు సాఫీగా సాగిపోతున్న జీవితం భార్య భర్తలు ఇద్దరూ కూలి పనులకు పోతూ వచ్చిన కొద్దిపాటి సంపాదనతో ఇద్దరు పిల్లలను పోషిస్తున్న సమయం వీరి అన్యోన్య కాపురం చూసి ఇ విధికే కన్నుకుట్టింది. భర్త మణి ప్రమాదవశాత్తు చెట్టు పై నుంచి పడి వెన్నుపూస దెబ్బ తినడంతో మంచానికే పరిమితం అయ్యారు. భర్తను బాగు చేసేందుకు భార్య చెయ్యని ప్రయత్నం లేదు, అయినా ఫలితం లేకపోయింది. దీంతో కుటుంబ పోషణ భారం నాగభూషణమ్మ పై పడింది. ఆమె కూలిపనికి వెళ్తేనే ఆ పూటా కడుపు నిండేది ఈ క్రమంలో పిల్లలిద్దరూ బడి మానేసి ఇంటివద్ద తండ్రిని చూసుకోవాల్సిన పరిస్థితి ఎదురయింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం కరోనా వీళ్ళపాలిట శాపంగా మారింది. పనులు లేక పస్తులు రోజులు గడుపుతున్నారు. దయనీయ స్థి తిలో ఉన్న వీరికి ఎలాంటి ఆసరా లేదు కుటుంబ యజమాని మణికి ప్రమాదం జరిగి రెండు ఏళ్ళు గడుస్తున్నా ఇప్పటికే వీరికి ప్రభుత్వం మంజూరు చేసే పింఛన్ అందడం లేదు, పింఛన్ కోసం అనేకమార్లు ప్రభుత్వ కార్యాలయాల ,చుట్టూ తిరిగిన ఎవరూ పట్టించుకోలేదని బాధితుడి భార్య నాగభూషణమ్మ వాపోయారు.

advertise

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*