ఏపీ లో కొత్తగా 222 పాజిటివ్ కేసులు కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది

advertise

ఏపీలో కోవిడ్ విజృంభన కొనసాగుతూనే ఉంది. కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో 222 మందికి కరోనా సోకినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా బులెటిన్ లో వెల్లడించింది. వీరిలో రాష్ట్రానికి చెందినవారు 186 మంది ఉండగా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు మరో 33 మంది ఉన్నారు. విదేశాల నుంచి వచ్చిన మరో ముగ్గుర కి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 5858 కి చేరింది . రాష్ట్ర వ్యాప్తంగా గత 24 గంటల్లో 1,4477 నమూనాలను పరీక్షించినట్లు వైద్యులు తెలిపారు. కృష్ణా జిల్లాలో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో.. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 82 కి చేరినట్లు పేర్కొన్నారు.

advertise

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*