23న బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం

advertise

బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం ఈ నెల 23న నిరాడంబరంగా నిర్వహించనున్నట్లు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. కరోనా వైరస్మహమ్మారి కారణముగా విధించిన
లాక్ డౌన్ అంక్షలా నేపథ్యంలో ఎల్లమ్మ కళ్యాణ ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ పశుసంవర్ధక డైరెక్టరేట్ లో దేవాలయ శాఖ జిహెచ్ఎంసి పోలీస్ ఇతర అధికార అధికారులతో మంత్రి సమీక్షించారు. గత 70 ఏళ్లుగా వంశపారంపర్యంగా సాగుతున్న ఈ కల్యాణోత్సవం నిర్వహణకు లక్షల సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని ఆశీస్సులు పొందడం ఆనవాయితీ, అయితే ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో చోటు చేసుకున్న విపత్కర పరిస్థితుల దృష్ట్యా పురోహితుల సమక్షంలో మాత్రమే కల్యాణోత్సవం నిర్వహించాలని నిర్ణయించారు. భక్తులు ఇతర ప్రజానీకం ఎవరు కళ్యాణోత్సవానికి రావొద్దని మంత్రి సూచించారు పెళ్లి తంతు ప్రక్రియ అంతా ప్రత్యక్ష ప్రసారం చేస్తామనిభక్తులంతా ప్రభుత్వానికి సహకరించి తమ ఇళ్లలోనే వీక్షించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.

advertise

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*